విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…

-బీసీవై మేయిర్ అభ్యర్థి కాకర్ల వేంకట శివ ప్రసాద్ హామీ
-అర్హులైన వారికి 133 గజాల ఇండ్ల స్థలం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గతంలో పాలించిన రాజకీయ నాయకుల్లా తాము ప్రజలను నమ్మించి మోసం చేయబోమని, విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడతామని బీసీవై (భారత చైతన్య యువజన పార్టీ) మేయర్ అభ్యర్థి కాకర్ల వేంకట శివ ప్రసాద్(నాని) స్పష్టం చేశారు. టార్చ్ లైట్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన, పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నాయకత్వంలో ప్రజలకు మేలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే విజయవాడలో అమలు చేయనున్న పలు కీలక హామీలను ఈ సందర్భంగా వెల్లడించారు:
ప్రతి కుటుంబానికి 133 గజాల స్థలం: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా 133 గజాల నివాస స్థలాన్ని అందిస్తామని తెలిపారు.
విజయవాడ నగరానికి ఏటా సమస్యగా మారిన బుడమేరు ముంపు ముప్పు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డ్రైనేజీ సమస్యల పరిష్కారం: నగరంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.శుక్రవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో బియస్ వై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గత 70 ఏళ్లుగా ఎవరూ చేయని రీతిలో విజయవాడ రూపురేఖలను సమూలంగా మార్చి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎదుటివారిని నిందించడం కంటే ప్రజలకు మంచి చేయడమే తమ ప్రాధాన్యమని పేర్కొంటూ, విజయవాడ ఓటర్లు టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి బీసీవై అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో విజయవాడ బిసివై నాయకులు తోకల రామకృష్ణ, మైలవరం నియేజకవర్గ కన్వినర్ ముప్పసాని భూలక్ష్మి, చింతల కృష్ణ, కోడాలి బాలాజి తదితరులు పాల్గొన్నారు.