Breaking News

అక్టోబర్ 18న మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

– జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్‌ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో అక్టోబర్ 18వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎమ్‌.సి.వి. మోటార్ కార్పొరేషన్‌, టీమ్‌ లీజ్‌, ఆప్యాక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థలలోని పలు ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నట్లు చెప్పారు. ఇంటర్‌ నుండి డిగ్రీ పూర్తి చేసినవారు, అనుభవం కలిగిన అభ్యర్థులు, 19 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ ఉద్యోగాలకు అర్హులనిb వివరించారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తక్షణమే నియామక అవకాశాలు కల్పించ బడతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jf1may25 ద్వారా తమ పూర్తి వివరాలతో పేర్లు నందు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు రెజ్యూమ్ లతో పాటుగా ఆధార్‌, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వ్యూ లకి సిద్ధమై హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *