Breaking News

రక్తదానం, హెచ్ఐవిలపై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం రక్తదానం, హెచ్ఐవిలపై అవగాహన కలిగించే వాల్ పోస్టర్లను ఇన్ ఛార్జి కలెక్టర్ డా. కె. మాధవిలత అవిష్కరించారు. చైల్డ్ ఫండ్ ఇండియా వారు కరోనా నివారణ జాగ్రత్తలు ప్రచురించిన కరపత్రాలను కూడా ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందు జాగ్రత్తగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోపు గర్బిణీలు హెవి పరీక్ష చేయించుకోవాడం మంచిదన్నారు. తన సమీపంలోని బసిటిసి సెంటర్లో ఉచితంగా మరియు గోప్యంగా ఈ టెస్ట్ చేయించుకోవచ్చున్నారు. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తప్పని సరిగా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. కళ్లు, ముక్కు నోటిని తరచు తాకరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా రోడ్లపై ఉమ్మి వేయరాదన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ టీకాలు వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిత, డియం హెచ్ ఓ డా. యం. సుహాసిని, డిప్యూటి డియం హెచ్ ఓ డా. జె. ఉషారాణి, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మహిళా మండలి సెక్రటరి రష్మీ, సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీనివాసరెడ్డి, తహాశీల్దార్లు వెన్నెల శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, భద్రునాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు,

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *