జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం…

-ఇంటింటి సర్వేకు ప్రత్యేక కార్యచరణ…
-నవంబరు 7వ తేదీ నాటికి ఇంటింటి సర్వే ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యచరణ మేరకు అక్టోబరు 4 నుంచి నవంబరు 7వ తేదీ వరకు సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్థానిక జెసి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహాశీల్దార్లు, యంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, గృహానిర్మాణ శాఖాధికారులతో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్) సూపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకుపోయిన గృహనిర్మాణ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ( ఒన్ టైం సెటిల్‌మెంట్) అమలు చేసేందుకు నిర్దేశించిన గడువులోగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి మండల స్థాయిలో ఈ నెల 4వ తేదిన తహాశీల్దార్లు, యంపిడివోలు, మండల సర్వేయర్లు కలిసి విఆర్ఓ, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించాలన్నారు. గృహనిర్మాణ శాఖ నుంచి తక్షణమే లబ్దిదారుల జాబితాలను తీసుకుని సచివాలయాల వారిగా విభజించాలన్నారు. ఈ పథకం అమలుపై ప్రభుత్వం ప్రకటించిన వివరాలను ముందుగా లబ్దిదారులకు తెలియపరచి వారు దానిని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. గతంలో రుణం తీసుకున్న లబ్దిదారుల జాబితాలను ఇప్పటికే ఖలైన్ లో ఉంచడం జరిగిందని వాటి ఆధారంగా సచివాలయాల వారిగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఆయా సచివాలయాలకు జాబితాలకు పంపి వాలంటీర్లతో సర్వే నిర్వహించాలన్నారు. రుణం తీసుకున్నవారు తీసుకున్న రుణాన్ని తీర్చేసినవారు, ఇతరులకు ఇళ్లను విక్రయించిన వారు, ఆ ప్రాంతం నుంచి వలస పోయిన వారు ఇలా వివిధ కేటగిరిలను రూపొందించాలన్నారు. ఫీల్డ్ సర్వే అనంతరం విలేజ్ సర్వేయర్లు సంబంధిత వివరాలు డిజిటల్ అసిస్టెంట్లకు అక్టోబరు 29 నుంచి నవంబరు 5వతేదీ లోపు వంపాలన్నారు. వాలంటీర్లు వీఆర్పోలు సర్వేయర్ల నుంచి పొందిన వివరాల డేటా ఎంట్రీని నవంబరు 6, 7 తేదీలో పూర్తి చేయాలన్నారు. ఇదే పట్టాణ ప్రాంతాల్లో నవంబరు 7, 8 తేదీలో పూర్తి చేయాలన్నారు. సకాలంలో ఈ సర్వే పూర్తి చేయించే భాధ్యత ఆయా మండల తహాశీల్దార్లు, యంపిడివోలు తీసుకోవాలన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *