Breaking News

మెగా రక్తదాన శిభిరానికి అపూర్వ స్పందన…

-ఆకర్షించిన మహాత్మాగాంధీ జీవితకాలక్రమ ఫోటో ప్రదర్శన….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్వచ్చంద రక్తదాతల దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి సందర్భాలతో పాటు ఆజాదీ కా అమ్మత్ మహోత్సవ కార్యక్రమాన్ని జోడించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జీవితకాల క్రమ ఫోటో ప్రదర్శన, మెగా రక్తదాన శిబిరాన్ని ఇంచార్జ్ కలెక్టర్ డా. కె. మాధవిలత ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలు కావాలన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారెవరైనా 18 నుంచి 65 సంవత్సరాల వయస్సుగల వారు రక్తదానం చేయవచ్చున్నాన్నారు. మెగా రక్తదాన శిభిరాన్ని చేపట్టి సుమారు 500 మంది రక్త సేకరణ చేయాలని సంకల్పించిన విజయవాడ సబ్ కలెక్టర్, వారి బృందాన్ని డా. కె. మాధవిలత ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చాలా ముఖ్యమైన విషయమని అపదలో ఉన్నవారిని రక్షించేందుకు ఎంతో అవసరమన్నారు. రక్తదాన చేసేవారిని ప్రోత్సహించవలసిన అవసరం వుందన్నారు. అదేవిధంగా మహాత్మగాంధీజి జయంతి, ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా వాసవ్య మహిళ మండలి, యువజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో మహాత్మగాంధీ జీవిత కాలక్రమాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపే రీతిలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన బాగుందని ఆమె తెలిపారు.
విజయవాడ సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రతీ రోజు నగరంలోని జిజిహెచ్ కు సుమార్ 300 మంది గర్భిణీలతో పాటు ప్రమాదాలకు గురి అయిన వారు చికిత్స కోసం వస్తుంటారని వారిలో అవసరమైన వారికి రక్తం అందించేందుకు అవసరమైన రక్త నిల్వల కోసం ఇటువంటి మెగా రక్తదాన శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు. కోవిడ్ అనంతరం రక్త నిల్వలు తక్కువగా వున్నాయని వీటిని పెంచేందుకు ప్రతీనెల రక్తదాన శిబిరాలు నిర్వహించవలసిన అవశ్యకత ఉ ందన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి తాను రక్తదానం చేస్తానని చెప్పారు. జాతీయ స్వచ్చంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిభిరం ద్వారా సుమారు 500 మంది నుంచి రక్త సేకరణ చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. ఇందుకు విజయవాడ డివిజన్ లోని రెవెన్యూ తదితర శాఖలతో పాటు జిజిహెచ్, వైద్య ఆరోగ్య శాఖ, యువజన సంక్షేమ శాఖ, పలు స్వచ్ఛంద సంస్థలు, అన్ని మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మంచి సహకారం అందించారన్నారు. అదేవిధంగా మహాత్మగాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్ మహోత్సలో భాగంగా గాంధీజి జీవిత చరిత్ర తెలిపే ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరిలో ముఖ్యంగా పిల్లల్లో స్వాతంత్ర్య స్ఫూర్తి, దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడాతాయన్నారు.
రక్తదాన శిబిరంలో తొలుత సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి గోదావరి, కృష్ణ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారు పండ్ల రసాలను అందజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *