కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ సందర్శన అనంతరం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐదు సంస్థల ప్రతినిధులతో ఎంఓయూల మార్పిడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కింబర్లైట్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.70 కోట్ల పెట్టుబడితో సంబంధించిన ఎంఓయూ మార్పిడి జరిగింది. దీని ద్వారా సుమారు 140 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
నూట్రాజెనిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కుప్పంలో రూ.350 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా సుమారు 300 మందికి ప్రత్యక్ష, 400 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.
పయనీర్ ఎక్స్‌ట్రాక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.67 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 250 మందికి ప్రత్యక్ష, 8,000 పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఎంగామ్ డెయిరీ ఫుడ్స్ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్ష, 900 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది.
ప్లాంటేస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.25 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ చేసుకుంది. ఈ సంస్థ ద్వారా సుమారు 125 మందికి ప్రత్యక్ష, 200 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.
మన రోవర్ మొబైల్ యాప్ ఆవిష్కరణ
అనంతరం కుప్పం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన ‘మన రోవర్’ మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Prajavartha Online Telugu News