ఈనెల 12,13 తేదీల్లో విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్-ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈనెల 12,13 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నం ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ భాగస్వమ్య సదస్సు జరగనుంది.ఇందుకు సబంధించిన ఏర్పాట్లపై సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులతో సమీక్షించారు.ఈసమావేశంలో ప్రధానంగా రానున్న పార్టనర్ షిప్ సమ్మిట్ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పెద్దఎత్తున దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అందుకనుగుణంగా సంబంధిత శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని సూసించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటుకు ఉన్న అనూకుల పరిస్థితులను సమ్మిట్ కు వచ్చే పెట్టుబడి దారులను సమగ్రమంగా వివరించి ఆయా రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే రీతిలో అధికారులు కృషి చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్యశాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ పార్టనర్ షిప్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇతర అంశాలపై వివరించారు. ఈభాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గోనున్నారని వివరించారు.అదే విధంగా ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణణ్ పాల్గోనున్నారని తెలిపారు.దేశ విదేశీ ప్రతినిధులు,వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గోనున్నారని వివరించారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శులు ఎస్.సురేశ్ కుమార్,ముఖేష్ కుమార్ మీనా,కాంతిలాల్ దండే,ఐఅండ్సి కార్యదర్శి ఎన్.యువరాజ్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఏపిఐఐసి ఎండి దినేష్ కుమార్,చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి,గీతాంజలి శర్మ ఎపి పైబర్నెట్ ఎండి,ఎంఎస్ఎంఇ సిఇఒ విశ్వ, ఎపి ఇడిబి సిఇఒ షన్మోహన్,ఎపి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ షబ్నమ్ బన్సల్, ఎపిఐఐసి ఇడి యశ్వంత్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొనగా వర్చువల్ గా ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్.విశ్వనాధన్ పాల్గొన్నారు.