మురాసు తుపాను బాధితులకు అండగా ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్

-తుపాను కారణంగా ఎదురయ్యే సమస్యలను వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేసే అవకాశం
-9552300009 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మురాసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తుపాను కారణంగా తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రజలు వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) అధికారులు తెలిపారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం, చెట్లు కూలిపోవడం, గోడలు కూలడం, ఇళ్లలోకి నీరు చేరడం వంటి సమస్యలతో పాటు తుపాను కారణంగా ఎదురయ్యే ఇతర ఇబ్బందులను కూడా 9552300009 నంబర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తుపాను సమయంలో అవసరమైన సహాయం పొందాలని అధికారులు సూచించారు.

మనమిత్ర ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా?
ముందుగా 9552300009 వాట్సాప్ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
అందుబాటులో ఉన్న సేవల ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అందులో ‘Murasu Cyclone Issues’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అనంతరం ‘Report Issue’ ఆప్షన్‌ను ఎంపిక చేసి, ‘Confirm’ చేయాలి.
తరువాత ‘Registration’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మీ పేరు, జిల్లా, మండలం వివరాలను నమోదు చేయాలి.
మీ ప్రాంతంలో తుపాను కారణంగా ఎదురవుతున్న సమస్యను వివరంగా నమోదు చేయాలి.
సమస్యకు సంబంధించిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.

ఫిర్యాదుపై తక్షణ స్పందనకు ఏర్పాట్లు
ప్రజలు నమోదు చేసిన సమస్యలను సంబంధిత ప్రాంత అధికారులకు వెంటనే పంపించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు RTGS అధికారులు తెలిపారు.

తుపాను సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అత్యవసర సమస్యలను అధికారుల దృష్టికి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ వాట్సాప్ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలందరూ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవను సద్వినియోగం చేసుకోవాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేయాలని RTGS అధికారులు విజ్ఞప్తి చేశారు.

మనమిత్ర వాట్సాప్ నంబర్: 9552300009