Breaking News

మంత్రి లోకేశ్ చొరవతోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

-ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు
-కూటమి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థ
-మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న చర్యల కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల ర్యాంకులతో ప్రకటనలు ఇచ్చేవని, ఇప్పుడు నారా లోకేశ్ చొరవతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోందని తెలిపారు.

అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటనలో భాగంగా ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో 23 మంది విద్యార్థులకు, వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన స్మారక కళావేదికను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఝాన్సీ నాగ వెంకట సాయి శ్రీ ను మంత్రి గొట్టిపాటి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేదని, అయితే మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతోందని అన్నారు. ఈ మేరకు విద్యార్థులకు అందిస్తున్నా షూ, బెల్ట్, యూనిఫార్మ్‌ ల పై ఎలాంటి రాజకీయాల పార్టీలకు సంబంధించిన గుర్తులు, రంగులు లేకుండా చూస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పంచుతున్న సైకిళ్లకు కూడా తెలుగుదేశం పార్టీ రంగులు కానీ, గుర్తులు కానీ లేకుండా ఉచితంగా దాతల సాయంతో ఇస్తున్నామని వివరించారు.

బీటీ, సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

గొట్టిపాటి రవి కుమార్ పర్యటనలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.5.10 కోట్ల వ్యయంతో శాంతినగర్ నుంచి ఏలేశ్వరవారిపాలెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రూ.1.15 కోట్లతో ఉప్పలపాడు, మైలవరం, వెంపరాలలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్ పథకం కింద కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *