అమరావతి, నేటి ప్రజావార్త:
గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు మంగళవారం శాసనసభలోని కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా… జీవో నంబర్ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా (నవంబరు 21) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అందించిన మెమొంటోను సీఎం వైయస్ జగన్‌కు మంత్రి అప్పలరాజు చూపించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …