అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీలో హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), అంజాద్ భాషా, పుష్పశ్రీ వాణి, మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పల రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, పేర్ని వెంకట్రామయ్య (నాని), బుగ్గన రాజేంద్ర నాధ్, కురసాల కన్నబాబు, పలువురు ఎంపిలు, ఎంఎల్సిలు, ఎంఎల్ఏలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …