విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్నట్టు రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో ఆయుష్ హాస్పిటల్ రోడ్డు నందు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబనికి చెందిన వెంకట లక్ష్మి గారికి జీవనోపాధి నిమిత్తం 30వేలు విలువ చేసే టిఫిన్ బండిని బుచ్చిబాబు అందజేయడం జరిగింది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆయన ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు ట్రస్ట్ ఛైర్మెన్ దేవినేని అవినాష్,వైస్ చైర్మన్ సుధీర గార్ల ఆధ్వర్యంలో దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు,ఆనంద్, రవి, నాంచారయ్య, బచ్చు మాధవి,బచ్చు మురళి,సొంగా రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …