-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యాదవ సోదర సోదరీమణులకు సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, వీరత్వం, ఐక్యతకు సదర్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ధర్మేంద్ర యాదవ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ, ఉత్సవ కమిటీ చైర్మన్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు, వివిధ రాష్ట్రాల యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.
