అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తెలంగాణా- ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఏపీ తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి స్థానిక మిలటరీ లోకల్ అథారిటీగా వివిధ అంశాలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సైనిక దళాలకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుతో మేజర్ జనరల్ జి.శ్రీనివాస్ భేటి
