అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి రాజధాని ప్రాంత మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో రాయపూడి APCRDA కార్యాలయంలో బుధవారం, 2026 నవంబర్ 4వ తేదీన శారీ ప్రీ-ప్లీటింగ్ & డ్రేపింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో గుంటూరుకు చెందిన RAAVIS Make-up Studio & Academy డైరెక్టర్ & శిక్షకురాలు ఎం. పద్మజ శిక్షణ అందించారు. వర్క్ షాప్‌లో అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 120 మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
శిక్షణలో భాగంగా శారీ ప్రీ-ఫోల్డింగ్, బాక్స్ ఫోల్డింగ్, ఇస్త్రీ చేసే పద్ధతులు, వివిధ రకాల శారీ డ్రేపింగ్ టెక్నిక్స్‌పై మహిళలకు శిక్షణ అందించారు. సొంతంగా సారీ డ్రేపింగ్ సేవలను అందించడం, బ్యూటీ పార్లర్లు, మేకప్ స్టూడియోలు, వివాహ వేడుకలు తదితర శుభకార్యాల్లో ఉపాధి పొందడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడిందని కార్యక్రమానికి హాజరైన మహిళలు తెలిపారు. APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం గ్రూప్ డైరెక్టర్ వి. రాములు గారు వర్క్ షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళలకు APCRDA ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాలను రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
