వంగవీటి రాధాకృష్ణకు అభినందనలు తెలిపిని ప్రత్తిపాటి శ్రీధర్, పెనుగొండ సుబ్బారాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ మేయర్‌గా విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు బుధవారం బందర్ రోడ్డులోని వంగవీటి రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లిన వారు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. మేయర్ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. వంగవీటి రాధాకృష్ణ నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పెనుగొండ సుబ్బారాయుడు, ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. నగర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.