-టీడీపీ కార్పొరేటర్ షేక్ ఆషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
50వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్‌గా విజయం సాధించిన షేక్ ఆషా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. షేక్ ఆషాను ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ షేక్ ఆషా మాట్లాడుతూ కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే తాను విజయం సాధించానని పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 50వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
