అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ (బాబు) శాసన పరిషత్ సభ్యునిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థలకు శాసన పరిషత్ సభ్యులుగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ (బాబు) చే శాసన పరిషత్ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ ఛాంబరులో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో 10 మంది ఈ నెల 8 వ తేదీన శాసన పరిషత్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణావల్ల అనంత సత్య ఉదయ భాస్కర్ (బాబు) ఆ రోజు శాసన పరిషత్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనందున నేడు ఆయన శాసన పరిషత్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (కాకినాడ సిటీ), పెండెం దొరబాబు (పిఠాపురం), జక్కంపూడి రాజ (రాజనగరం), నాగులాపల్లి ధనలక్ష్మీ (రంపచోడవరం) తదితరులతో పాటు అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …