గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ జె.వి. నారాయణ ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ తో మర్యాదపూర్వక భేటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గిద్దలూరు మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన బీజేపీ నాయకుడు జె.వి. నారాయణ శుక్రవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పీవీఎన్ మాధవ్‌తో కొద్దిసేపు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన జె.వి. నారాయణకు రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి సెల్స్ జాతీయ కో కన్వీనర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఎన్నికల ఇంఛార్జి కొక్కెర శ్రీ నివాస్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ర శివనారాయణ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు నాగోతు రమేష్ నాయుడు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధ్యక్షుడు కృష్ణా రావు మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యిద్ బాషా తదితరులు ఈ సందర్భంగా నారాయణ ను అభినందించారు.