చెప్పాం… చేస్తున్నాం… ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెడుతున్నాం: దేవినేని ఉమా

-మండపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
-33, 34వ వార్డుల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ప్రచారం

తూర్పుగోదావరి జిల్,మండపేట, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అభివృద్ధి–సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చాటిచెప్పేలా “చెప్పాం… చేస్తున్నాం…” కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి పట్టణంలోని 33, 34వ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, వార్డుల అభివృద్ధికి సంబంధించిన అవసరాలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలతో పాటు పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రచారంలో వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.‌‌ ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.‌ చెప్పిన మాటను చేతల్లో చూపిస్తూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ… అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా “చెప్పాం… చేస్తున్నాం…” కార్యక్రమంతో మండపేటలో ఎన్నికల ప్రచారం కొనసాగింది.