విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగానికి కృష్ణా విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం హోదాను కల్పించినట్లు ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ తెలిపారు. పిహెచ్.డి. కోర్సులో ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులకు ఈ కళాశాల అధ్యాపకులు గైడ్లుగా వ్యవహరిస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేళ్ల పాటు 2028- 29 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, డీప్ లెర్నింగ్ సబ్జెక్టుల్లో పరిశోధకులకు పి.బి. సిద్ధార్థ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ టి.ఎస్. రవికిరణ్ గైడ్ గా వ్యవహరిస్తారు. పి.బి. సిద్ధార్థ కళాశాల డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల అధిపతి డాక్టర్ కొంపల్లి ఉదయశ్రీ మెషిన్ లెర్నింగ్ కి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్లకు పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తారు. ఇప్పటికే పి.బి. సిద్ధార్థ కళాశాలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ విభాగాలలో రీసెర్చి సెంటర్లు కృష్ణా విశ్వవిద్యాలయ అనుమతితో కొనసాగుతూ పరిశోధక విద్యార్థులకు మార్గనిర్దేశకత్వం చేస్తున్నాయని డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. కృష్ణా వర్సిటీ పరిధిలో ఐదవ రీసెర్చి సెంటరును డిపార్ట్ మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కు కేటాయించడం పట్ల కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలితప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
పి.బి. సిద్ధార్థకు రీసెర్చి సెంటరు… కృష్ణా వర్సిటీ ఉత్తర్వులు
