మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, 49 వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

పంజా సెంటర్ కు చెందిన కూరాకుల వసుంధర రమాదేవి (52) కాలుకి ఇన్ఫెక్షన్ సోకి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3.90 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు దుర్గా ప్రసాద్, లింగం శివప్రసాద్, గొట్టం సాంబశివరావు, పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, దుర్బేసుల హుస్సేన్, బొల్లెపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.