బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి అందజేశారు. 58 వ డివిజన్, బాప్టిస్ట్ పాలెం కు చెందిన గౌడి పేరు స్వర్ణ లత (45) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 7.16 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు కామ దేవరాజ్, దాడి అప్పారావు, పచ్చవ మల్లికార్జున, బ్రహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.