-నవంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 పూర్తి నోటిఫికేషన్‌ను ఈ నెల 5వ తేదీన విడుదల చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం బుధవారం (నవంబర్ 11) నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోగా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. డీఎస్సీ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అభ్యర్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, పూర్తి నోటిఫికేషన్, హెల్ప్‌డెస్క్ వివరాలను https://tet2dsc.apcfss.in వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజైన నవంబర్ 11న మొత్తం 397 మంది అభ్యర్థులు 487 పేపర్లకు దరఖాస్తు చేసుకున్నట్లు కృష్ణారెడ్డి వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
