గొల్లపూడిలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి ఎన్నికల ప్రచారం ప్రారంభం

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గొల్లపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని సుబ్బారావు తనయుడు బొమ్మసాని జయంత్ సాయి ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. గొల్లపూడి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 19వ వార్డు అభ్యర్థి బొర్రా తిరుపతిరావుతో పాటు అనిల్, కాస్టిల్, వడ్లమూడి ప్లాజా మరియు ఎల్ఐసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, సీనియర్ నాయకులు గూడపాటి పద్మశేఖర్, కొట్టే బాలు, రైతు అధ్యక్షులు నూతులపాటి శివరాం తదితరులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.