-“పరిశుభ్రమైన శబరిమల పవిత్రమైన శబరిమల”ఈఏడాది నినాదం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా శబరిమల ఉత్సవానికి విస్త్రతమైన ఏర్పాట్లు చేసినట్టు తిరువనంతపురం ట్రావన్కోర్ దేవస్వం బోర్డు(Travnacore Devaswom Board)అధ్యక్షులు కె.జయకుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ కు వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి ఏటా అధిక సంఖ్యలో అయ్యప్ప మాలదారులైన అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు.మరో కొద్ది రోజుల్లో రెండు నెలల పాటు జరిగే శబరిమల పండుగ మహోత్సవం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరమైన యాత్రా అనుభవాన్ని అందించేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.గతంలో గుర్తించిన పలు లోపాలను సరిదిద్దడం జరిగిందని ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని ఆయన ఆలేఖలో పేర్కొన్నారు.కొత్త పారిశుద్ధ్య విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మరుగుదొడ్ల వినియోగాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా ఒక ప్రొపెషనల్ ఏజెన్సీకి వాటి నిర్వహణ బాధ్యతను అప్పగించి వారి సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు.పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా తగినంత పరిమాణంలో అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచనున్నామని జయకుమార్ స్పష్టం చేశారు.
“పరిశుభ్రమైన శబరిమల పవిత్రమైన శబరిమల”అనేది ఈ ఏడాది ప్రధాన ఇతివృత్తంగా నిర్ణయించి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ జయకుమార్ వెల్లడించారు. పంపా నది వద్ద అయ్యప్ప భక్తులు వదిలివేసే పాత దుస్తులను విముక్తం చేయడం ఒక సవాలుగా ఉందని నదిలో పాత దుస్తులను వదిలివేయడం భక్తులకు సాంప్రదాయంగా వస్తోందని అయితే ఈ ఆచారానికి ఎలాంటి మతపరమైన లేదా ఆచార సంబంధమైన ప్రాముఖ్యత లేదని కావున ఈ అలవాటుపై అయ్యప్ప భక్తుల్లో నిరుత్సాహపరచాల్సిన అవసరం ఉందని ఆదిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఈ ముఖ్యమైన సందేశాన్ని ప్రభుత్వ మీడియా ద్వారా అయ్యప్ప భక్తులకు విస్తృతంగా తెలియజేయాలని కోరుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన ఆలేఖలో జయకుమార్ తెలియజేశారు.ఈ ఏడాది శబరిమల యాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ట్రావన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షులు జయకుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు.
