కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు

-ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో రెండో దశలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ సమన్వయ కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయకర్తలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కూటమిలో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు జనసేన పార్టీ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, కూటమి పార్టీల నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం, స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి.
స్థానిక ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే అన్ని ప్రాంతాల్లో విజయం సాధించే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కమిటీలు పనిచేయనున్నాయి.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు:
కందుల దుర్గేష్ – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
కొణతాల రామకృష్ణ – అనకాపల్లి ఎమ్మెల్యే
పిడుగు హరిప్రసాద్ – ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
బొమ్మిడి నాయకర్ – ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే
బత్తుల బలరామకృష్ణ – రాజానగరం ఎమ్మెల్యే
గిడ్డి సత్యనారాయణ – పి. గన్నవరం ఎమ్మెల్యే
చిల్లపల్లి శ్రీనివాస్ – ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్
సామినేని ఉదయభాను – ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు
వేగుళ్ల లీలాకృష్ణ – రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్
ఘంటసాల వెంకటలక్ష్మి – వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు:
వంశీకృష్ణ శ్రీనివాస్ – విశాఖ దక్షిణ ఎమ్మెల్యే
సుందరపు విజయ్ కుమార్ – యలమంచిలి ఎమ్మెల్యే
లోకం మాధవి – నెల్లిమర్ల ఎమ్మెల్యే
నిమ్మక జయకృష్ణ – పాలకొండ ఎమ్మెల్యే
టి. శివశంకర్ – ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్
కొరికాన రవికుమార్ – సుడా చైర్మన్
రెడ్డి అప్పలనాయుడు – ఏలూరు మేయర్
పాలవలస యశస్వి – రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
పెనుగొండ సుబ్బారాయుడు
దుగ్గిశెట్టి సుజయ్ బాబు
ఈ కమిటీల నియామకంతో కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఎన్నికల సమాయత్తంపై దృష్టి సారించింది.