ఎన్టీఆర్ జిల్లాలో 16 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి

-16 మండల పరిషత్‌లలో అధ్యక్షులుగా టీడీపీ అభ్యర్థుల ఎన్నిక
-ఉపాధ్యక్ష స్థానాల్లో 13 మంది టీడీపీ, ముగ్గురు జనసేన పార్టీ అభ్యర్థులకు అవకాశం
-ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షుల వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.

జిల్లాలోని మొత్తం 16 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నికయ్యారని వెల్లడించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించగా, మొత్తం 16 మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, మూడు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు.

మండలాల వారీగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షుల వివరాలు:

* చందర్లపాడు : అధ్యక్షురాలిగా దాసర నరసమ్మ (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా నల్లాని శ్రీనివాసరావు (టీడీపీ).

* జగ్గయ్యపేట : అధ్యక్షురాలిగా కట్టా సరస్వతి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా మువ్వ పద్మ (టీడీపీ).

* కంచికచర్ల : అధ్యక్షురాలిగా శివనాగమల్లేశ్వరి కొగంటి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా నాయిని త్రివేణి (జనసేన).

* నందిగామ : అధ్యక్షురాలిగా గడిపర్తి సుశీల (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా రుద్రపోగు వెంకటరావమ్మ (జనసేన).

* పెనుగంచిప్రోలు : అధ్యక్షురాలిగా గజ్జి విజయలక్ష్మి (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా గజ్జి కృష్ణమూర్తి (టీడీపీ).

* వత్సవాయి : అధ్యక్షురాలిగా పెరుమాళ్లపల్లి సునీత (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా స్వప్న పెంటేల (టీడీపీ).

* వీరులపాడు : అధ్యక్షురాలిగా నండ్రు వనిత (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా మేకపోతుల నర్సిరెడ్డి (టీడీపీ).

* ఎ.కొండూరు : అధ్యక్షుడిగా భూక్య సురేష్ బాబు (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా జాస్తి శ్రీ చందన్ (టీడీపీ).

* గంపలగూడెం : అధ్యక్షురాలిగా బురుగు అంజలి (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా చెరుకూరి సాయిచంద్ (టీడీపీ).

* రెడ్డిగూడెం : అధ్యక్షుడిగా ముప్పిడి నాగేశ్వరరెడ్డి (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా బొమ్మిన కోటేశ్వరరావు (టీడీపీ).

* తిరువూరు : అధ్యక్షుడిగా గద్దె వెంకటేశ్వరరావు (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా కోమటి వెంకటరామారావు (టీడీపీ).

* విస్సన్నపేట : అధ్యక్షురాలిగా వల్లభనేని రాణి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా సంబారు విజయలక్ష్మి (టీడీపీ).

* జి.కొండూరు : అధ్యక్షురాలిగా గెరా అనిత (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా అనురాధిక వుయ్యూరు (టీడీపీ).

* ఇబ్రహీంపట్నం : అధ్యక్షురాలిగా గొరిజాల వెంకట శివకుమారి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా చింతల లక్ష్మీకుమారి (జనసేన).

* మైలవరం : అధ్యక్షురాలిగా వేముల సరోజిని (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా సూరిసెట్టి రమణ (జనసేన).

* విజయవాడ రూరల్ : అధ్యక్షుడిగా పరుచూరి నరేష్ (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా నబిగాని కొండయ్య (టీడీపీ).

జిల్లాలోని 16 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మరియు మహిళా కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. మండల ప్రజా పరిషత్‌లలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయా మండలాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు.