-రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 288, వార్డు సభ్యులకు 1,417 నామినేషన్లు దాఖలు
-రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు మొత్తం 349, వార్డు సభ్యులకు 1,632 నామినేషన్లు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు నవంబర్ 19న ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న ఏడు మండలాల్లో రెండో రోజున సర్పంచ్ స్థానాలకు 288, వార్డు సభ్యుల స్థానాలకు 1,417 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి రోజు దాఖలైన వాటితో కలిపి ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు మొత్తం 349 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 1,632 నామినేషన్లు అందినట్లు ఆయన వివరించారు.
నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో రెండు రోజుల్లో…
1. చందర్లపాడు మండలం : సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 3, రెండో రోజు 28 మొత్తం: 31.
వార్డు సభ్యులు: మొదటి రోజు 2, రెండో రోజు 175 మొత్తం: 177.
2. జగ్గయ్యపేట మండలం : సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 17, రెండో రోజు 81 మొత్తం: 98.
వార్డు సభ్యులు: మొదటి రోజు 47, రెండో రోజు 317 మొత్తం: 364.
3.కంచికచర్ల మండలం:
సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 12, రెండో రోజు 21 మొత్తం: 33. వార్డు సభ్యులు: మొదటి రోజు 59, రెండో రోజు 128 మొత్తం: 187.
4.నందిగామ మండలం:
సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 8, రెండో రోజు 35 మొత్తం: 43. వార్డు సభ్యులు: మొదటి రోజు 39, రెండో రోజు 155 మొత్తం: 194.
5.పెనుగంచిప్రోలు మండలం :
సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 2, రెండో రోజు 21 మొత్తం: 23. వార్డు సభ్యులు: మొదటి రోజు 1, రెండో రోజు 123 మొత్తం: 124.
6.వత్సవాయి మండలం:
సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 9, రెండో రోజు 53 మొత్తం: 62. వార్డు సభ్యులు: మొదటి రోజు 10, రెండో రోజు 230 మొత్తం: 240.
7.వీరులపాడు మండలం :
సర్పంచ్ స్థానాలు: మొదటి రోజు 10, రెండో రోజు 49 మొత్తం: 59. వార్డు సభ్యులు: మొదటి రోజు 57, రెండో రోజు 289 మొత్తం: 346.
ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు మరియు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
