– ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
– నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన
– నవంబర్ 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం
– డిసెంబర్ 2న అవసరమైన చోట్ల పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
– ఫలితాలు ప్రకటించిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్) గురువారం
నోటిఫికేషన్ జారీ చేశారు.
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర
పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్)
విడుదల చేశారు. ఈ విడతలో రాష్ట్రంలోని 25 జిల్లాలకు చెందిన వివిధ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21వ తేదీన సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేసి, అదే రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.
నవంబర్ 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నవంబర్ 25వ తేదీన నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లను స్వీకరిస్తారు. నవంబర్ 26వ తేదీన అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఎన్నికలు అవసరమైన గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే ఉపసర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఆ రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే, మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు.
రీపోలింగ్ అవసరమైన సందర్భాల్లో డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. రీపోలింగ్ నిర్వహించిన గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికను రీపోలింగ్ ఫలితాలు ప్రకటించిన తర్వాతే నిర్వహిస్తారు.
మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలను నోటిఫికేషన్‌కు జతచేసిన అనుబంధం-II లో పొందుపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్) తెలిపారు.
