కొనకళ్ళ నారాయణరావును పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మాజి ఎంపీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ రావును మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురైన కొనకళ్ళ నారాయణరావుకు హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఎండోవాస్కులర్ బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి కొనకళ్ళను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు.
కొనకళ్ళ నారాయణ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని త్వరగా కోలుకోవాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు తదితరులు ప్రమర్శించారు.