విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికీ చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ఎల్ ఓ సీ పత్రాలు మంజూరయ్యాయి ఊర్మిళ నగర్ లో నివాసముండే అబ్దుల్ నజీర్ (53) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు అతడికి చికిత్స నిమిత్తం రూ 7.45 లక్షలు మంజూరయ్యాయి. రాజరాజేశ్వరి పేటలో నివాసముంటున్న టీ మేరీ (64) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది ఆమెకు చికిత్స నిమిత్తం రూ 8 లక్షల ఎల్ ఓ సీ మంజూరైంది. భవానిపురం ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 40 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు తో కలిసి అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
బాధితులకు ఎల్ ఓ సీ అందజేత
