ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

-మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో నిర్ణయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్.) ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించడం లేదని నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్ 23, 2026న ఉదయం 11 గంటలకు అంబేద్కర్ కళావేదికలో నూతన మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉండనున్నందున సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఇన్‌ఛార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు విజ్ఞప్తి చేశారు.