కాకినాడలో కూటమి మహా ర్యాలీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలంతా కాకినాడ నగరంలో శనివారం సాయంత్రం మహార్యాలీ నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్డు మీద మొదలైన ర్యాలీ నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. “మా ఐక్యత రాష్ట్రం కోసం.. ప్రగతి పరుగుల కోసం” అంటూ నినదించారు. కాకినాడ నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మహా ర్యాలీలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కాకినాడ జెడ్పీ ఛైర్మన్ బుర్రా దివ్య సునీత రాజ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.