-ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది. చేపలు, రొయ్యల సంపూర్ణ వినియోగం, సముద్ర ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం.
ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తుల తయారీలో ఇరు సంస్థలు పరస్పర సహకారం అందించుకోనున్నాయి. పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, శిక్షణ, స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ సహకరించనుంది.
ఈ అంతర్జాతీయ భాగస్వామ్యంతో రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగంలో సుస్థిర అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అదనపు ఆదాయ అవకాశాలు మెరుగుపడనున్నాయి. భీమవరం ఆక్వాకల్చర్ రంగానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.
