-అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా 62వ డివిజన్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవితో పాటు డివిజన్ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కోరారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్తులో రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకమని నేతలు పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థులను ఘనవిజయం దిశగా ముందుకు తీసుకెళ్లి, అభివృద్ధి, సంక్షేమ పాలనకు మరింత బలాన్ని చేకూర్చాలని నేతలు పిలుపునిచ్చారు.
