తాడికొండ, కంతేరులో ముమ్మరంగా ల్యాండ్ పూలింగ్

-అమరావతి అభివృద్ధికి 8.98 ఎకరాల భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం తాడికొండ, కంతేరు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులు మొత్తం 8.98 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందించేందుకు అంగీకరించారు.

ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 20, 2026) రైతులు APCRDA అధికారులకు తమ అంగీకార పత్రాలను అందజేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR)తో పాటు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రైతులు తెలిపారు.

కంతేరులో 5.70 ఎకరాలు

కంతేరు గ్రామంలో ముగ్గురు రైతులు మొత్తం 5.70 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు కాంపిటెంట్ అధికారి బి. సాయి శ్రీనివాస నాయక్‌కు అంగీకార పత్రాలను అందజేశారు.

భూములు అందజేసిన రైతుల వివరాలు:

వి. కృష్ణమోహన్ రెడ్డి – 1.30 ఎకరాలు
ఎం. సామ్రాజ్యం – 1.00 ఎకరం
టి. సువర్ణ కుమారి – 3.40 ఎకరాలు
తాడికొండలో 3.28 ఎకరాలు

తాడికొండ గ్రామంలో మరో ముగ్గురు రైతులు 3.28 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతిరావుకు అంగీకార పత్రాలను అందజేశారు.

భూములు అందజేసిన రైతుల వివరాలు:

ముక్కమళ్ల సామ్రాజ్యం – 2.76 ఎకరాలు
మేడికొండూరు శేషుకుమారి – 0.50 ఎకరాలు
కాకుళ్ల సామ్రాజ్యం – 0.02 ఎకరాలు
రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక రవాణా ప్రాజెక్టుల నిర్మాణానికి రైతులు సహకరిస్తూ భూములు అందించేందుకు ముందుకు రావడం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మరో ముందడుగుగా నిలిచింది.