ఆంధ్ర లయోలా కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం

-NCC నావల్ క్యాడెట్ల ఆధ్వర్యంలో అవగాహన ఉపన్యాసం, స్కిట్ ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా యువత, విద్యార్థుల్లో క్షయవ్యాధిపై అవగాహన కల్పించేందుకు 8 (ఆంధ్ర) నావల్ యూనిట్ NCC ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
NCC డైరెక్టరేట్ AP&T ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 12 వరకు నిర్వహించనున్న నావల్ సెయిలింగ్ ఎక్స్‌పెడిషన్ (MENU–2026)లో భాగంగా సామాజిక సేవ, సమాజ అభివృద్ధి కార్యక్రమంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ డా. ఎస్. మెల్కియార్, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఎం. అరుళ్ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సుజీత్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో NCC క్యాడెట్లు క్షయవ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్సపై అవగాహన ఉపన్యాసం ఇవ్వడంతోపాటు స్కిట్ ప్రదర్శించారు. విద్యార్థులు, స్థానిక యువతకు టీబీపై అవగాహన కల్పించారు.
క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా NCC క్యాడెట్లు నుక్కడ్ నాటకాలు, ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని కమాండర్ సుజీత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో NCC నావల్ వింగ్ కేర్‌టేకర్ అనిల్ కాసుల, కెప్టెన్ నిరంజన్, అసోసియేట్ అధికారులు, NCC క్యాడెట్లు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.