-50 ఏళ్ల వ్యాపార అనుభవం కలిగిన ఆంజనేయ శర్మతో ఆత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలో ఐదు దశాబ్దాలుగా పండ్ల టోకు వ్యాపారంలో కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ వ్యాపారి మల్లాది ఆంజనేయ శర్మను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ అయోధ్యనగర్‌లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఆంజనేయ శర్మ నివాసానికి విచ్చేసిన బుచ్చి రామ్ ప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుచ్చి రామ్ ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సమావేశంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు ఏ.వి. రమణ, ఈమాని సూర్యనారాయణ, జింకా చక్రధర్‌తో పాటు పలువురు బ్రాహ్మణ ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కలయిక ఆత్మీయ వాతావరణంలో సాగింది.
