-పశు వైద్య, పారా సిబ్బంది, వాహన చోదక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
-డా ఎస్జిటి సత్య గోవింద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులకు, పారావేట్ లు, డ్రైవర్లు గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సంయుక్త సంచాలకులు, డా.యస్.టి.జి. సత్య గోవింద్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా YSR సంచార పశు సేవా రధాల మేనేజర్ రమేష్ రావును (ఫోన్: 6260624232) సంప్రదించగలరు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ డాక్టర్లు కూడా అర్హులేనని తెలియజేశారు. పారావెట్ పోస్టులకు డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపూ వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్ పోస్టులకు (డ్రైవరు) పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్ ఏం వి లైసెన్స్ తో కనీసం 2 లేదా 3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపూ వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు రాజమండ్రి, దేవీచౌక్ దగ్గర, గోకవరం బస్ స్టాండ్ రోడ్ లో గల గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఆవరణలో గల జిల్లా పశు వైద్యాధికారి వారి కార్యాలయం వద్ద ఈ నెల 29 వ తేదీన ఉదయం 9.00 గంటలకు అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు
ఫోన్: 6260624232.సంప్రదించ వచ్చునని ఆయన ఆ ప్రకటన లో తెలిపారు.
Prajavartha Online Telugu News