గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరాలి

-ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జేట్స్ తీసుకుని రావద్దు
-హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం పేర్కొన్న గుర్తింపు కార్డు తప్పనిసరి
-పరీక్షా కేంద్రం లోకి గంట ముందు అనుమతి ఇవ్వడం జరుగుతుంది
-అరగంట ముందే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి
-నాలుగు షిఫ్ట్ లలో కంప్యూటర్ టెస్ట్ హాజరుకానున్న 418 మంది ఉద్యోగులు
-డి ఆర్వో నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ , వార్డు కార్యదర్శులకు కంప్యూటర్ నైపుణ్యంపై ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మే 26 ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు.

గురువారం ఉదయం డిఆర్వో ఛాంబర్ లో పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీ. నరసింహులు మాట్లాడుతూ, కారుణ్య నియామకాలు కింద నియమించబడి రెవెన్యూ , పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖల తరపున గ్రామ, వార్డ్ సచివాలయాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు కంప్యూటర్ నైపుణ్యం పై పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పరీక్షలను నాలుగు షిఫ్ట్ గా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోందన్నారు. కాతేరు లోని జీ ఎస్ ఆర్ ఆన్లైన్ అకాడమీ లో కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి ఒక గంట ముందు అనుమతించడం జరుగుతుందని నరసింహులు తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం జరగదని తెలిపారు. హాల్ టిక్కెట్ తో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఫోటో గుర్తింపు కార్డు లలో ఆధార్, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు ఇతర గుర్తింపు వాటిల్లో ఏదో ఒకటి తప్పని సరిగా వెంట తీసుకుని రావాలని పేర్కొన్నారు. పోలీసులు అబ్బాయి లకు, అమ్మాయి లకి విడివిడిగా ప్రిస్కింగ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు, భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని పోలీస్ అధికారులను త్రాగునీటి వసతి, టాయ్లెట్స్ ఏర్పాటు చేయాలని జీఏస్ఆర్ ఆన్లైన్ అకాడమీ వారిని ఆదేశించారు. కంప్యూటర్ టెస్ట్ నిర్వహణకు సంబంధించి ముందస్తుగా కంప్యూటర్ ల్యాబ్ లో సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని, కళాశాల ప్రిన్సిపాల్ తో రేపటి పరీక్షకు అనుగుణంగా తనిఖీ చేసి నివేదిక అందజేయ్యాలని స్పష్టం చేశారు.

జిల్లాలో మే 26 శుక్రవారం పరీక్షలకు మొత్తం 418 హాజరు కానున్నట్లు ఎపిపి ఎస్సీ సెక్షన్ ఆఫీసర్ జీ. అశోక్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి ఉ.10 ల వరకు మొదటి షిఫ్ట్ 100 మంది , మ.12 నుంచి మ.12.30 వరకు 2వ షిఫ్ట్ లో 106 మంది , మ.2.30 నుంచి మ.3 వరకు మూడోవ షిఫ్ట్ 106 మంది , సా.5 నుంచి సా.5.30 వరకు నాల్గోవ షిఫ్ట్  106 మంది తో కంప్యూటర్ టెస్ట్  జరుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో ఎపిపిఎస్సీ సెక్షన్ ఆఫీసర్ జి. అశోక్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాసిం వలి , తహశీల్దార్ పి. చిన్నారావు , ఎస్ ఐ . ఎల్. బాలాజీ, మెడికల్ తరపున పి. జాన్సన్, ఎలక్ట్రల్ ఎలక్ట్రికల్ శాఖ తరపున వై. మల్లిఖార్జున రావు, పౌర సరఫరా శాఖ తరపున కె. ఎస్. ప్రభాకర్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *