విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామిలకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆదివారం డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 100 మంది అయ్యప్పస్వామిలకు అన్నప్రసాదాలు అందజేశారు. ఎండాకాలంలో పాదచారులు, వాహనదారులు సేదతీరడానికి మజ్జిగ పంపిణీ నుండి ఆసుపత్రులలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. దానిలో భాగంగా అయ్యప్పస్వామిలకు అన్నప్రసాదాలు అందజేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయకుమారి మాట్లాడుతూ ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా మా వంతుగా డొక్కా సీతమ్మ కమిటీ మెంబర్స్ అందరం ఎప్పుడు పేదలకు సేవ చేయడానికి ముందుకు వస్తారన్నారు. ప్రజలకు ఎప్పుడూ ఏమీ అవసరమో వాటిని మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామన్నారు. తనకు ఏ విషయంలోనైనా మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరం ముందు వచ్చి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములతోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాములు అందరూ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్‌ను అభినందించి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయకుమారిని, కమిటీ సభ్యులను ఆశీర్వదించారు.
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామిలకు అన్నప్రసాదాలు
