హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు అవినాష్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో పాటు, ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, దేశంలో లౌకికవాద విలువలను కాపాడటం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే గణేష్, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
