విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎపి బిజెపి కో ఇంఛార్జి వనతి శ్రీ నివాసన్ పర్యటన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద కు చేరుకున్న వనతి శ్రీ నివాసన్ కు బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు తో బిజెపి శ్రేణులు భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. స్థానిక ఎన్నికల లో అభ్యర్థులు, పార్టీ పటిష్టత అంశాలు పై చర్చ జరిగింది. ఆమెకు స్వాగతం పలికిన వారి లో బిజెపి రెండు రాష్ట్రాల సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి హెడ్ క్వార్టర్స్ ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మజ, కార్యాలయ కార్యదర్శి పవన్ జీ, మువ్వల వెంకట సుబ్బయ్య తదితరులు ఉన్నారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి… ఎపి బిజెపి కో ఇంఛార్జి వనతి శ్రీ నివాసన్
