-ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 81వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 81వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మేడా అనురాధతో కలిసి రైతు బజారు, భగీరథ కాలనీ ప్రాంతాల నుంచి గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మేడా అనురాధను కార్పొరేటర్‌గా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అర్హులైన పేదలకు అందాల్సిన పింఛన్లలో కొన్నింటిని తొలగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
81వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మేడా అనురాధ మాట్లాడుతూ.. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్లోని స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తనను కార్పొరేటర్‌గా, రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా గెలిపించి అఖండ మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
