Breaking News

ఆరోగ్య శ్రీ ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న పరిమితి రూ.25 లక్షలకు పెంపు

-జనవరి ఒకటి నుంచి 2 వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష
-ప్రతి గృహ సందర్శన సమయంలో ప్రజల నుంచి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలి
-ప్రతి ఒక్కరూ వారి మొబైల్ లో దిశా యాప్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
-ప్రతి కుటుంబం సందర్శన సమయంలో ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పించాలి
-కలెక్టర్ కె. మాధవీలత
-ఎస్పీ పి. జగదీష్

రాజమహేంద్రవరం, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ చికిత్స, ఇతర అత్యంత ఖరీదైన విద్య చికిత్స కోసం పరిమితి లేకుండా పూర్తి స్థాయి వైద్య పరంగా సహకారం అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు సోమవారం ఉదయం “మెగా ఆరోగ్యశ్రీ అవగాహన జిల్లా స్థాయి కార్యక్రమంకు కలెక్టర్ , ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీ లత మాట్లాడుతూ, ప్రజల్లో ఆరోగ్యశ్రీ పై మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో నూతనంగా కార్డుల పంపిణీ, కర పత్రాలు అందచెయ్యడం జరుగుbతుందని అన్నారు. దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే విధానం ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరుగుతోందని అన్నారు. గతంలో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉండే చికిత్స విధానం స్థాయి ని నేడు రూ.25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై ప్రజలకు ఎటువంటి సందేహాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు కేవలం పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యశ్రీ పథకం వార్షిక ఆదాయం నేడు రూ.5 లక్షల వార్షిక ఆదాయం పొందుతున్న మధ్యతరహా కుటుంబాలకు వర్తింప చెయ్యడం జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి మొబైల్ లో దిశా యాప్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పని సరి అని కె. మాధవీలత పేర్కొన్నారు. సంబంధిత యాప్ లో ఒక కుటుంబ సభ్యులు డేటా ఎంట్రీ చెయ్యడం వల్ల భవిష్యత్తు లో వైద్య సేవలు అందించే సమగ్ర సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ప్పుడు 1057 రకాలకు మాత్రమే వైద్య సేవలు అందిస్తే నేడు 3257 రకాల రోగాలకు వైద్య పరంగా సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందన్నారు. అదే విధంగా గతంలో కేవలం 750 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటే నేడు 2,513 నెట్వర్క్ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో వచ్చాయని అన్నారు. పేద , మధ్యతరహా ఆదాయ వర్గాల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కోసం రూ.25 లక్షలకు పెంచి పూర్తి ఆరోగ్య భరోసా ఇచ్చే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాకుండా, ఆరోగ్య ఆసరా ద్వారా ప్రతినెలా రు.5 వేల భృతి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. వాళ్ళు తిరిగి ఆదాయ పనులకు వెళ్ళే వరకు డాక్టర్ల సూచనల మేరకు ఆర్థికంగా అండగా నిలవడం జరుగుతోందనీ అన్నారు.

ఎస్పీ పి. జగదీశ్ మాట్లాడుతూ, దిశా యాప్ ను డౌన్లోడ్ చేసిన క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ తో సమన్వయం చేస్తూ, ఆరోగ్యశ్రీ యాప్ కూడా డౌన్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయి లో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారుల ద్వారా పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చెయ్యనున్నట్లు తెలిపారు.

డిసిసిబి చైర్మన్ ఆకలి వీర్రాజు మాట్లాడుతూ డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు.

ప్రతి ఇంటికీ వెళ్ళి ఆరోగ్యశ్రీ పై మరింత అవగాహన కల్పిస్తూ, కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

సగటున దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతంగా ఉంటే ఇది మన రాష్ట్రం లో కేవలం 4 శాతం మాత్రమే కావడం మన అందరికీ గర్వకారణ మన్నారు.

లబ్ధిదారుల అభిప్రాయాలు..

రాజమహేంద్రవరం కు చెందిన జీ. సూమంజలి మాట్లాడుతూ, తన భర్త ఆటో డ్రైవర్ అని, వైద్య పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ న్నామని, డా వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో తన భర్తకి మెరుగైన వైద్యం అందచేశారని పేర్కొన్నారు. తన భర్త ఆరోగ్య స్థితి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం అందచేస్తున్న సహాయం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వంటి ఎందరో పేదల ఆరోగ్య పరిరక్షణ కి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం నేడు అందుబాటులో ఉంది అని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం అర్బన్ నివాసి మహమ్మద్ శ్రేయ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నా భర్త ఆటో డ్రైవర్ నా భర్త సంపాదన కుటుంబ ఖర్చులకే అంతంతమాత్రంగా సరిపోతుంది. మా పాపకు బ్లడ్ క్యాన్సర్ వైద్యం చేయించాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాది ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇందుకు నేనే నిదర్శనమన్నారు. మా పెద్ద పాపకు అమ్మబడి వస్తుంది. ఇంత ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞలు తెలియజేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ పి. జగదీష్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి సి సి బి చైర్మన్. ఆకుల వీర్రాజు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక, డి ఎమ్ హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు, జీ జీ హెచ్ సూర్య ప్రభ, ఇతర వైద్య అధికారులు, అర్బన్ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, షర్మిలా రెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *