-కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా జిల్లా లోని ఆరోగ్య మహిళా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి చర్మ వ్యాధులు మరియు నరములకు సంబంధిచిన అనుమానిత కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీసీ హాల్లో జిల్లా కాలక్టర్ అధ్యక్షతన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(LCDC) జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా లోని వార్డు ,గ్రామ సచివాలయాల పరిధిలో ఆశ కార్యకర్త,మగ వాలంటీరులు, ఆరోగ్య మహిళా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి అనుమానిత చర్మ వ్యాధులు, నరములకు సంబంధిచిన కేసులను గుర్తించి వైద్య సహాయాన్ని అందించాలన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం భాగంగా డిసెంబర్ 27 నుంచి 2024 జనవరి 12 వ తేది వరకు నిర్వహించనున్న కుష్టువ్యాధి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(LCDC) కు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం చెయ్యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. .కే .వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లా లోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రములోని వైద్యాధికారులందరికీ శిక్షణ యిచ్చి ఈ కార్యక్రమముని విజయవంతం చేస్తామన్నారు. .
జిల్లా లేప్రోసీ,ఎయిడ్స్,టిబి అధికారిణి డా. ఎన్. వసుంధర మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములోని వైద్యాధికారులందరికీ పార మెడికల్ సిబ్బందికి,ఆశ కార్యకర్తలకు మరియు వాలంటీరులు మరియు ఎన్ఎల్ఈపి (NLEP) నోడల్ పర్సన్స్ కు శిక్షణ ఇవ్వడం జరిగినదన్నారు..గతం లో జరిగిన రెండు LCDC కార్యక్రమములు మరియు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమునందు ఆరోగ్య సిబ్బంది విజయవంతంగా నిర్వహించారన్నారు. .
అలాగే ఈ LCDC కార్యక్రమములో కూడా విజయవంతంగా నిర్వహించాలని ఎక్కువ అనారోగ్య కేసులను గుర్తించి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా ఎస్ పి. జగదీష్, మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్, కుష్ఠు వ్యాధి నిర్ములనపై నిర్వహించే అవగాహన గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డీ సీ సీ బి చైర్మన్ ఆకుల వీర్రాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధి ఎమ్.సందీప్ డీపి ఓ జె.సత్యనారాయణ డిపి ఆర్ ఓ ఐ కాశయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి డి ఐ సి. డి. ఎస్ కె.ఎస్. ఆర్ వి ఎస్ ఎన్ ఎల్ విజయ కుమారి, జిల్లా ఆశా ప్రతినిధి ఎమ్.అర్జునరావు, డి పి ఎమ్ ఓ సిహెచ్.అభిషేక్ రెడ్డి,
NLEP సిబ్బంది, DPMOలు, PMO కె.వీరలక్ష్మి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News