రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.18.12.2023 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వక్తృత్వ ,వ్యాస రచన, చిత్రలేఖనము పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై అవగాహన సదస్సులు జరిగినవని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం తెలిపారు.
ఈ వ్యాస రచన మరియు చిత్రలేఖనము పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు మరియు చిత్రలేఖనము పోటీల్లో చిన్నారుల యొక్క సృజనాత్మకతను, ప్రతిభను మరియు విద్యుత్ పొదుపు పై అవగాహనను పెంపొందిస్తున్నాయి. విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు. అమలాపురం డివిజన్ పరిధిలో విద్యుత్ పొదుపు పై అవగాహనలో భాగంగా రాజోలు లో వ్యాస రచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నారాయణ పాఠశాలనందు నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ డివిజన్ పరిధిలో విద్యుత్ పొదుపు పై అవగాహనలో భాగంగా, కాకినాడ నగరంలో ఏ ఎస్ ఆర్ కె పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, ఇంజరం నందు, మరియు జిల్లా పరిషత్ పాఠశాల, గైగోలుపాడు నందు వ్యాసరచన మరియు చిత్రలేఖనము పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమాలలో 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో విద్యుత్ పొదుపు పై అవగాహనలో భాగంగా సామర్లకోట అయోధ్య రామాపురం మునిసిపల్ హై స్కూల్ లో మరియు పెద్దాపురం రూరల్ లో శ్రీ ఆర్ కె పాఠశాల నందు చిత్రలేఖన పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమంలో 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
రామచంద్రపురం డివిజన్ లో విద్యుత్ పొదుపు పై అవగాహనలో భాగంగా మండపేట మరియు ద్రాక్షారామం లో బుర్రకథ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మండపేట, రామచంద్రపురం మరియు ఏడిద సెక్షన్లలో వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన తెలియజేయు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది. రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ పరిధిలో విద్యుత్ పొదుపు పై అవగాహనలో భాగంగా ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ నందు వివిధ పాఠశాలలకి చెందిన విద్యార్థులకు చిత్రలేఖన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ పరిధిలో అనపర్తి సెక్షన్ లో విద్యుత్ పొదుపు మరియు దాని ఆవశ్యకత మీద ప్రచురింపబడిన పోస్టర్లను వివిధ కార్యాలయములనందు ఏర్పాటు చేయడం జరిగినది. జగ్గంపేట డివిజన్ పరిధిలో శంఖవరం సెక్షన్ లో జిల్లా పరిషత్ పాఠశాల, శంఖవరం నందు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థు లకు ఉత్సావాలు ముగింపు రోజున అనగా ది.20.12.2023 తేదీన బహుమతులు అందచేయటం జరుగుతుందని శ్రీ టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు తెలిపారు.
Prajavartha Online Telugu News