అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
హోం ఓటింగు కోసం సమగ్ర ఇంటింటి సందర్శన చేసి ఆకేటగిరి లో ఉన్నటు వంటి ఓటర్లను గుర్తించి, సంభందిత అంగీకార పత్రం పొందడం జరిగిందనీ, హోం ఓటింగ్ నిమిత్తం తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలు పై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఉన్న అనపర్తి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హోమ్ ఓటింగు పై నోడల్ అధికారులు, సూపర్ వైజర్, బి ఎల్ వో లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్వో ఎమ్ మాధురీ మాట్లాడుతూ, 85 ఏళ్లు ఉన్న వృద్ధుల నుంచి, 40 శాతం దివ్యంగుల నుంచి ఫారం 12 డి ద్వారా అంగీకార పత్రం తీసుకున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో ఉన్న 216 పోలింగ్ కేంద్రాల పరిధిలో హోం ఓటింగు కి సంబంధించిన ఓటర్లు ఉన్నారన్నారు . సంభందిత బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సందర్శన సమయంలో వారి ద్వారా ఫారం 12 డి కి చెందిన అంగీకార పత్రం తీసుకోవడం జరిగిందనీ, కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు తదుపరి కార్యాచరణ ప్రణాళికను ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం పకడ్బందీగా కార్యచరణ అమలు చేయాలన్నారు. నియోజక వర్గంలో 1149 మంది 85 ఏళ్లు, పైబడిన ఓటర్లు ఉన్నారనీ వారిలో పురుషులు 442 , మహిళలు 707 మంది ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా దివ్యాంగ ఓటర్లు (పి డబ్ల్యూ డి) 2,675 మంది ఉండగా పురుషులు 1617 , స్త్రీలు 1058 ఉన్నట్లు తెలిపారు. ఫారం 12 డి తీసుకున్న వారికీ ఇంటి వద్దనే పోలింగు సిబ్బంది వొచ్చి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఓటు హక్కును కల్పించడం పై అవగాహన కల్పించడం జరిగిందనీ రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, సూపర్వైజర్ లు, బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.