-మూడు రాజధానులకి వ్యతిరేకంగా జగన్ ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ : టి.డి.పి ఎం.పి అభ్యర్థి కేశినేని శివ నాథ్
-నామినేషన్ దాఖలు చేసిన వసంత కృష్ణ ప్రసాద్
-ర్యాలీలో పాల్గొన్న కేశినేని శివ నాథ్, దేవినేని ఉమ
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం అడ్డుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిలిపివేశాడు. అమరావతి రాజధాని గా ఉండాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి గా అధికారంలోకి రావాలన్నారు. బిజెపి జనసేన బలపరిచిన టిడిపి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ గా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి, జి కొండూరు మీదగా వెళ్లి మైలవరం పట్టణం లోని తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా కేశినేని శివనాథ్ , మాజీ మంత్రి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త దేవినేని ఉమామహేశ్వరరావు కలిసి పాల్గొన్నారు. కేశినేని శివనాద్ ఈ ర్యాలీ లో పాల్గొనటానికి ముందుగా దేవినేని ఉమా ఇంటికి వెళ్లి ఆయనతో పాటు కలిసి వచ్చారు.. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటుచేసిన చైతన్య రథం పై వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు కేశినేని శివనాథ్ ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నవరత్నాలు అంటూ నవరత్నాలంటూ నవ మోసాలు చేసిన జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచి ఇంటికి పంపించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని అసెంబ్లీ కి పంపించాలని పిలుపునిచ్చారు. పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శివనాథ్ చెప్పారు..
ప్రచారంలో జనసేన, బిజెపి నాయకులు అక్కల రామ్మోహన్, నూతలపాటి బాల, వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు దీమంత్ సాయి తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు వేలాదిగా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News